గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

గుర్తు తెలియని వ్యక్తి మృతి గల్ఫ్‌లో గుండెపోటుతో గొల్లపల్లి వాసి..

సిరిసిల్లటౌన్‌: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. సిరిసిల్ల కొత్త బస్టాండ్‌ వద్ద ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి వయస్సు 40–45 ఏళ్ల వరకు ఉంటుందని, 5.6 అడుగుల ఎత్తు, గుండ్రటి ముఖం, చామనచాయ రంగులో ఉండి, ఎరుపు రంగు చొక్కా , గ్రీన్‌ రంగు ప్యాంటు, గ్రీన్‌ కలర్‌ బనియన్‌ ధరించి ఉన్నట్లు సీఐ తెలిపారు. ఎడమ చేతిపై సుజాత, కుడి చేతిపై ఎస్‌ఎస్‌ అని పచ్చబొట్టు ఉన్నాయని, ఎవరికై నా మృతుడి ఆచూకీ తెలిస్తే టౌన్‌ సీఐ 87126 56366, ఎస్సై 87126 56368 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకటరెడ్డి(48) అనే గల్ఫ్‌ కార్మికుడు మంగళవారం వేకువజామున గుండెపోటుతో మలేషియాలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వెంకట్‌రెడ్డి స్వగ్రామంలో ఉపాధిలేక కుటుంబ పోషణకు ఆరేళ్ల క్రితం కంపెనీ వీసాపై గల్ఫ్‌ వెళ్లాడు. 22నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి తిరిగి మలేషియాకు వెళ్లిన వెంకట్‌రెడ్డి రూంలోనే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఈ సమాచారాన్ని అక్కడి మిత్రులు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను కోరారు. అలాగే వాట్సాప్‌ ద్వారా వెంకట్‌రెడ్డికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సైతం పంపించినట్లు సర్పంచ్‌ కొండ రమేశ్‌గౌడ్‌ తెలిపారు. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పొన్నాల మణెమ్మ పరామర్శించారు. మృతుడికి భార్య వనజ, కూతురు జావలి ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సర్పంచ్‌ కోరారు.

పరీక్ష ఫీజు చెల్లించాలి

కరీంనగర్‌ సిటీ: పీజీ ప్రఽథమ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్‌, ఎంబీఏ బీఎల్‌ఐసీ ప్రథమ, 1వ సెమిస్టర్‌ 2025–26 విద్యా సంవత్సరం పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రం అధికారి డా.ఎం సత్యప్రకాశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.500తో చెల్లించేందుకు ఈనెల 30వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement