మల్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయమే తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించారు.
నృసింహునికి వసంతోత్సవం
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామివారి నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం అభిషేకాలు, హారతిమంత్ర పుష్పం నిర్వహించారు. ఉదయం అన్నకూటోత్సవం చేశారు. సాయంత్రం ఆలయ ఉత్సవమూర్తులకు వివిధ చెట్ల ఆకులతో పల్లవోత్సవం, పండ్ల రసాలతో వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.


