వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అధికారిక రిజిస్టర్‌లో సర్పంచ్‌కు బదులు ఆమె భర్త సంతకం చేయడం చర్చనీయాంశమైంది. వివరాలు.. రంగంపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ఆఫ్టర్ కేర్ (అనాథ పిల్లల సంరక్షణ) కార్యక్రమాన్ని అంగన్‌వాడీ టీచర్ లక్ష్మీనర్సవ్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి సూపర్‌వైజర్ మమత హాజరై, 18 ఏళ్లు పైబడిన అనాథ పిల్లలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథుల వివరాల కోసం రిజిస్టర్‌లో సంతకాలు సేకరించారు. ముందుగా గ్రామ సర్పంచ్ సంతకం చేయాలి. కానీ, సర్పంచ్ భర్త నక్క పర్శరాములు తానే సర్పంచ్ అని చేయగా, తర్వాత ఆమె భార్య భాగ్యలక్ష్మి సంతకం చేశారు. ఇది చూసిన అధికారులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా, గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో సర్పంచ్ భర్తే పెత్తనం చలాయిస్తున్నారని, ప్రతీ విషయంలోనూ తలదూర్చుతూ అయోమయానికి గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారిక రిజిష్టర్‌లో సంతకం చేసిన సర్పంచ్ భర్త


