అడవికి ఆపద | - | Sakshi
Sakshi News home page

అడవికి ఆపద

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

మంథని: కరీంనగర్‌ తూర్పు డివిజన్‌లో సుమారు 80 కిలో మీటర్ల దూరంలో విస్తరించిన ఉన్న అడవిలో ప్రతీ వేసవిలో ఆపద వస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోతోంది. ఏటా వేసవిలో అడవి ఇలా కాలిపోతున్నా అటవీ శాఖ అదికారులు పట్టించుకోవడం లేదు. మంథని–కాటారం ప్రధాన రహదారితో పాటు తూర్పు మండలాలను ఆనుకొని రింగ్‌ రోడ్డులో మంటలు చెలరేగుతున్నాయి. దారి వెంట ప్రయాణించే ఆకతాయిల చర్యల వల్ల అడవి అంటుకొని మంటలో అడవి జంతువులకు అపాయం జరుగుతుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. తూర్పు డివిజన్‌ల్లో అడవి అంటుకుంటే మండల ఆర్పటానికి అటవీశాఖ వద్ద పరికరాలు ఉన్నాయి. కానీ వాటిని సకాలంలో ఉపయోగించపోవడంతో నష్టం వాటిల్లుతోంది. అడవి అంటుకుంటున్న సమాచారం అటవీశాఖకు సరైన సమయంలో చేరకపోవడంతో ప్రమాదం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement