లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పిన బైక్‌

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

సిరిసిల్ల అర్బన్‌: సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడు శివారులో లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు. సోమవారం సాయంత్రం బైక్‌పై బీవై నగర్‌కు చెందిన రామ్‌చరణ్‌(17), బద్దెనపల్లికి చెందిన యశ్వంత్‌(16), సిరిసిల్లకు చెందిన నవీన్‌(16) వేములవాడ వైపు వెళ్తున్నారు. రగుడు ఎల్లమ్మ గుడి ప్రాంతంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రామ్‌చరణ్‌ తలకు తీవ్రగాయాలు కాగా, యశ్వంత్‌ కాలు విరిగింది. నవీన్‌కు చెవి తెగిపోయింది. వీరిని 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. రామ్‌చరణ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.

ముగ్గురికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఒకరి పరిస్థితి విషమం

Advertisement
 
Advertisement
Advertisement