వైభవంగా పూర్ణాహుతి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పూర్ణాహుతి

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

కరీంనగర్‌కల్చరల్‌: శ్రీమద్విరాట్‌

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో కమాన్‌ వద్ద గల ఆలయంలో హోమం, పూర్ణాహుతి, విశేష పూజలు, భజన కార్యక్రమాలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆల య కమిటీ చైర్మన్‌ ముత్తోజు రాంకుమార్‌, ధర్మకర్తలు వెగ్గలం రామకృష్ణ, ఎదులాపురం మహేశ్‌, గోగులకొండ నరసింహాచారి, వంగల నవీన్‌,

కరుణాకర్‌ పాల్గొన్నారు.

దేశాభివృద్ధికి జనగణన కీలకం

కరీంనగర్‌కార్పొరేషన్‌: జనగణన భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం 2వ డివిజన్‌ పరిధి తీగలగుట్టపల్లిలోని తన నివాసంలో స్వీయ గణనను ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధికి జనగణన కీలకమని చెప్పారు. నగర ప్రజానీకానికి స్వీయ గణన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, ప్రజలు స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే 11 నుంచి జనాభా లెక్కల కోసం వచ్చే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సరైన వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దిన్‌, పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీలు వేణు, శ్రీధర్‌ ఆధ్వర్యంలో తన ఇంటి, కుటుంబ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అలాగే సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి నగరపాలకసంస్థ అధికారుల సమక్షంలో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement