వీబీజీ రాంజీ చట్టం రద్దు కోసం దేశవ్యాప్త పోరాటం | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రాంజీ చట్టం రద్దు కోసం దేశవ్యాప్త పోరాటం

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

కరీంనగర్‌టౌన్‌: ఉపాధి కూలీలకు నష్టం చేసే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా సంఘటిత ఉద్యమాలు ఉధృతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ముకుందలాల్‌ మిశ్రాభవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 13వ మహాసభలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించాలని కొత్త చట్టంలో పేర్కొన్నా ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ పథకానికి కేటాయించలేదన్నారు. మహాసభల సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి అజయ్‌ జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునుటి శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి ప్రసంగించారు. సంఘం ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, మాతంగి శంకర్‌, రాయికంటి శ్రీనివాస్‌, కనకం దుర్గాప్రసాద్‌, సుంకరి సంపత్‌, మిర్యాల రవి, మాడెం శెట్టి యుగేంధర్‌, లక్ష్మయ్య, రేణుక, రజిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement