వరి కోతకు హార్వెస్టర్లు రావడంతో పనులు తేలికగా మారాయి. కూలీలతో ఎకరం పొలం కోయించి ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు దాదాపు రూ.10వేల వరకు ఖర్చు వచ్చేది. ఇప్పుడు శ్రమ తగ్గడంతోపాటు ఎకరం పొలం ఖర్చు రూ.3వేల లోపే అవుతుండటం రైతులకు కలిసి వస్తోంది.
– ఏలేటి జలేందర్, ఇటిక్యాల, రాయికల్(మం)
పొలమంతా ఉన్న గడ్డిని ఇంటికి తీసుకెళ్లడం కష్టంగా మారడంతో కాలబెట్టేవాడిని. ఇప్పుడు, వరి గడ్డి కట్టలు కట్టే యంత్రం రావడంతో కట్టలు కట్టించి ఇంటికి తెచ్చుకుంటున్నా. నాకున్న పాడి గేదేలకు ఆరు నెలల పాటు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది.
– సత్యనారాయణ రెడ్డి, సారంగాపూర్


