వేములవాడ: భీమన్న క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించారు. భీమన్న ఆలయంలో కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు చెల్లించుకున్నారు. ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాసీ్త్ర స్వామివారిని దర్శించుకున్నారు. అమెరికాలోని న్యూ జెర్సీలో శివవిష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘుశర్మ, ప్రధానమంత్రి సలహాదారులు ఆదిత్య దీక్షిత్ దర్శించుకున్నారు.


