జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని కేంద్రీయ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న రీజియన్‌స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. 35 విద్యాలయాల నుంచి అండర్ 14, 17, 19 విభాగాల్లో 137 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సర్దార్ భాషా బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు..
అండర్ 19 బాలికల విభాగంలో చంద్రిక, జాహ్నవిప్రియ, శ్రీవర, బాలుర విభాగంలో వైష్ణవ్ నాగసాయి, కుమార్ రావత్, రేవంత్ దత్తా, అంజు గోస్వామి, అండర్–17 బాలికల విభాగంలో మనస్వి, రాశికుమారి, సాన్వి, మనోజ్ఞ, బాలుర విభాగంలో సత్యం యాదవ్, ప్రణయ్‌గౌడ్, ప్రేమ్ అభినవ్, మణిశంకర్, అండర్–14 బాలికల విభాగంలో షణ్ముఖ ప్రియ, జవ్విత, చైత్ర రెడ్డి, బాలుర విభాగంలో ఆకుల రాంచరణ్ తేజ, చంద్ర కిశోర్, మైఖేల్ రియాన్, రామ చతుర్వేదిలు విజేతలుగా నిలిచారని ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సర్దార్ బాషా తెలిపారు.
ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్‌లో నిర్వహించిన బ్యాడ్మింటన్ క్రీడలు ఆహ్లాదాన్ని అందించాయి. అండర్17లో పో టీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించాం. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటాం.
– మనస్విని, సాన్వి, పికెట్, సికింద్రాబాద్
కేంద్రీయ విద్యాలయం రీజియన్ స్ధాయిలో బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. తిరుమలగిరి విద్యాలయం, బోయినపల్లి కేంద్రీయ విద్యాలయం నుంచి అండర్–17లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాం. – ప్రణయ్ గౌడ్,
తిరుమలగిరి, భవిష్యకుమార్ బోయినిపల్లి
విజేతలకు బహుమతులు అందజేత


