అన్యాక్రాంతమవుతున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ భూమి | - | Sakshi
Sakshi News home page

అన్యాక్రాంతమవుతున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ భూమి

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారానికి చెందిన కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కర్మాగారం నుంచి ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డు వరకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరువైపులా 80 ఫీట్ల విస్తర్ణం ఉండాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రగతినగర్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు షెడ్లు నిర్మించారు. ఇదే అదునుగా మరికొందరు రాజకీయ పలుకుబడితో పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై ఉన్న భూములను కబ్జా చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన ఆర్‌ఎఫ్‌ిసీఎల్‌ ఎస్టేట్‌ విభాగం అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే గౌతమినగర్‌ ప్రధాన చౌరస్తాలో పూర్తిస్థాయిలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ స్థలం కబ్జాకు గురైంది. ఇప్పటికై నా ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కార్పొరేషన్‌ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించి రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement