ఈతకొడుతుండగా నీటమునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకొడుతుండగా నీటమునిగి యువకుడి మృతి

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో నివాసముండే బుడిగజంగాల కుటుంబానికి చెందిన పస్తం పవన్‌(18) శనివారం ఈతకొడుతుండగా పిట్స్‌ రావడంతో నీటమునిగి చనిపోయాడు. మరోఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈదుతుండగా పిట్స్‌ వచ్చినట్లు స్థానికులు తెలిపారు. యువకుడు కొన్నేళ్లుగా పిట్స్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పస్తం రాంచందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పవన్‌ ఉన్నాడు. రాంచందర్‌కు ఉన్న ఏకై క కుమారుడు పవన్‌ మృత్యువాత పడడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు.

జగిత్యాలక్రైం: బీర్‌పూర్‌ మండలకేంద్రంలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అదేగ్రామానికి చెందిన చీర్నేని బుచ్చన్నకు తీవ్రగాయాలయ్యాయి. బుచ్చన్న తన ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా.. జన్నారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బుచ్చన్న తలకు తీవ్రగాయాలుకాగా.. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీర్‌పూర్‌ ఎస్సై రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement