కన్నందుకేనా మాకీ శిక్ష | - | Sakshi
Sakshi News home page

కన్నందుకేనా మాకీ శిక్ష

Apr 21 2026 4:26 AM | Updated on Apr 21 2026 4:26 AM

నా ముగ్గురు కుమారులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, సంపత్‌రెడ్డికి నాకున్న 11.36ఎకరాల భూమిని పంచి రిజిస్ట్రేషన్‌ చేశాను. భూమి పంచిన నుంచి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంటి నుంచి వెళ్లగొట్టి, నా భార్య మెడలో ఉన్న బంగారం కూడా లాక్కున్నారు. న్యాయం కోసం కలెక్టర్‌ దగ్గరికి వచ్చినం. కన్నందుకా మాకీ శిక్షా?

– కె.రాజిరెడ్డి, రేకొండ, చిగురుమామిడి

ఉన్నది 1.03ఎకరాలు.. నమోదైంది 29గుంటలు

నాకు పాత పాస్‌బుక్‌లో సర్వేనంబర్‌ 601/ఎలో 1.03ఎకరాల భూమి ఉంది. ధరణి వచ్చాక ఉన్న భూమి వివరాలు రావాల్సి ఉండగా 29గుంటలుగా వస్తుంది. ఇదెక్కడి అన్యాయమని ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. ఎవరూ పట్టించుకోవడం లేదు. మిగతా 14 గుంటల భూమిని రికార్డులో నమోదు చేయాలని కోరితే పరిష్కరించడం లేదు.

– తిరుపతి, కోర్కల్‌, వీణవంక

Advertisement
 
Advertisement
Advertisement