కారు ఢీకొని మామ, అల్లుడు దుర్మరణం
తిమ్మాపూర్: బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా కారు రూపంలో వచ్చిన మృత్యువు మామ, అల్లుడిని బలి తీసుకుంది. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో రామంచ క్రాసింగ్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన శ్రీరాములు రామచంద్రం(75), హుస్నాబాద్‌కు చెందిన అవధూత్ శ్రీనివాస్(55) సిద్దిపేట జిల్లా తోటపల్లి గ్రామంలో బంధువు అంత్యక్రియలకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. కొత్తపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. రామచంద్రం అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనాస్థలాన్ని సీఐ సదన్‌న్ కుమార్, ఎస్‌ఐ అన్వర్ పరిశీలించారు. మృతుడు శ్రీనివాస్ భార్య, రామచంద్రం కూతురు పరమేశ్వరి ఫిర్యాదుతో కారు డ్రైవర్ సాగి సాయిశ్రవణ్‌పై కేసు నమోదు చేశారు.
కారు ఢీకొని మామ, అల్లుడు దుర్మరణం


