ప్రగతికి నిచ్చెన | - | Sakshi
Sakshi News home page

ప్రగతికి నిచ్చెన

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

ప్రగత

ప్రగతికి నిచ్చెన

పల్లె పాలకులకు శిక్షణ..

చందుర్తి(వేములవాడ): పల్లె పాలన పగ్గాలను చాలా గ్రామాల్లో అతివలు చేజిక్కించుకున్నారు. ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతలు నెరవేర్చిన మహిళలు పల్లెపాలనలో తమ ప్రత్యేకతను చాటుకునేందుకు అడుగులు వేస్తున్నారు. వీరి అడుగులు మరింత బలంగా.. ప్రణాళికాబద్ధంగా పడేందుకు జాతీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంటు పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. సర్పంచుల బాధ్యతలు తెలుసుకోవడంతోపాటు నిధుల వినియోగం.. విధుల నిర్వహణపై హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఇటీవల శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణకు రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. చందుర్తి మండలం మర్రిగడ్డ, వేములవాడ అర్బన్‌ మండలం అనుపురం, తంగళ్లపల్లి మండలం చింతలఠాణా, ముస్తాబాద్‌ మండలం గూడూరు, గంభీరావుపేట మండలం దేశాయిపేట గ్రామాల మహిళా సర్పంచులు పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈనెల 16 నుంచి 19 వరకు ఈ శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన పాలనకు పునాది వేస్తూ నూతన నాయకత్వాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుందని శిక్షణకు హాజరైన సర్పంచులు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణలో తెలుసుకున్న పలు అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

జిల్లా నుంచి ఐదుగురు సర్పంచులకు అవకాశం

గ్రామపంచాయతీ పాలనపై అవగాహన

విధులు, బాధ్యతలపై స్పష్టత

ప్రగతికి నిచ్చెన1
1/1

ప్రగతికి నిచ్చెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement