పొలంలో గడ్డికోస్తూ కుప్పకూలిన రైతు | - | Sakshi
Sakshi News home page

పొలంలో గడ్డికోస్తూ కుప్పకూలిన రైతు

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

పొలంలో గడ్డికోస్తూ కుప్పకూలిన రైతు

పొలంలో గడ్డికోస్తూ కుప్పకూలిన రైతు

ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన రైతు కనికిరెడ్డి బాబు(60) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. బాబుకు 2 ఎకరాల పొలం ఉంది. ఉదయం వ్యవసాయం పనులతోపాటు, గడ్డికోయడానికి వెళ్తానని ఇంట్లో చెప్పాడు. పొలం గట్టుపై గడ్డికోస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని మరోరైతు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారి వచ్చి చూసేసరికే బాబు మృతి చెంది కనిపించాడు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య రాయమల్లమ్మ, కుమారుడు కిశోర్‌ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది.

గుండెపోటుతో పొలంలోనే మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement