చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఉండాలి

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

సుల్తానాబాద్‌రూరల్‌: చట్టాలపై అవగాహన ఉండాలని మున్సిఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి గణేశ్‌ అన్నారు. గట్టెపల్లిలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి పలు సూచనలు చేశారు.

తెలంగాణ జాగృతి నేతల సమావేశం

గోదావరిఖని: తెలంగాణ జాగృతి నేతల సమావేశం శనివారం స్థానిక హెచ్‌ఎంఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రూప్‌సింగ్‌నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నాయకులతో చర్చించారు. పెద్దపల్లి జిల్లాలో 13 జెడ్పీటీసీ, 138 ఎంపీటీసీ, మంచిర్యాల జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు జాగృతి సంస్థ మద్దతుతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ బీఫామ్‌పై పోటీ చేయడంపై ఇందులో చర్చించారు. ఈవిషయంలో త్వరలోనే రెండు జిల్లాలకు ఇన్‌చార్జిలను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 23న అభ్యర్థుల జాబితా తయారు చేయనున్నట్లు వెల్లడించారు. హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్‌, అధ్యక్షుడు సారయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement