సిట్ నోటీసులకు భయపడేది లేదు
● కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్
కొత్తపల్లి(కరీంనగర్): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకే సిట్ నోటీసుల పేరుతో ప్రజలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ గురువారం కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్(బావుపేట)లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలను ఛీత్కరిస్తున్న సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు నోటీసుల డ్రామాకు తెరలేపారని విమర్శించారు. బద్దిపల్లి సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, రెడ్డవేణి మధు, రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, పిల్లి మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


