మత్స్యగిరీంద్రుని కల్యాణం
శంకరపట్నం: శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ భూదేవి, నీలాదేవి సమేత మత్స్యగిరీంద్రస్వామి కల్యాణం గురువారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకను తిలకించారు. ఈవో సుధాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 1నుండి 20 వరకు ప్రతి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఏదైనా తాగునీటి సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1916 ఉపయోగించుకోవాలన్నారు. జెడ్పీ సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పంటల సాగు ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం(జగిత్యాల) ఏడీఆర్ డా.ఎస్.హరీశ్ కుమార్ శర్మ అన్నారు. గురువారం స్థానిక తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(కరీంనగర్) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. జిల్లాలో ప్రధాన సాగు సమస్యలు, నేల ఆరోగ్యం, నాణ్యమైన విత్తనాల లభ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. అసోసియేట్ డీన్ నవీన్ కుమార్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ కోఆర్డినేటర్ బి.హరికృష్ణ్ణ, డీఏవో భాగ్యలక్ష్మి, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్: రాజీవ్ రహదారిపై బ్లాక్‌స్పాట్లను పరిశీలించామని డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు. గురువారం రవాణాశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలుగునూర్ నుంచి టోల్‌ప్లాజా వరకు ఉన్న 27 బ్లాక్‌స్పాట్లలో 24బ్లాక్‌స్పాట్లను సరిదిద్దామని అన్నారు. ఎంవీఐ రవి కుమార్, ఏఎంవీఐ హరిత యాదవ్, రక్షణ రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ నీలం సంపత్ పాల్గొన్నారు.
చొప్పదండి: మండలంలోని గుమ్లాపూర్ శివారులో ఫిబ్రవరి 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశాలు ఉండటంతో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం సభా స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీవో మహేశ్వర్‌తో కలిసి చొప్పదండి, గుమ్లాపూర్‌ల మధ్య పొనుకల గుట్ట వద్ద ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోనే ఒక ప్రైవేటు గెస్ట్‌హౌజ్ ఉండటంతో ఇక్కడ బహిరంగ సభకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.
మత్స్యగిరీంద్రుని కల్యాణం
మత్స్యగిరీంద్రుని కల్యాణం
మత్స్యగిరీంద్రుని కల్యాణం


