కాంగ్రెస్‌లో జోష్!
న్యూస్‌రీల్
సీఎం పర్యటనతో పల్లెల్లో రాజకీయ వేడి
సర్పంచ్, వార్డు అభ్యర్థుల్లో ఉత్సాహం
లక్ష కోట్ల కాళేశ్వరం కూలేశ్వరమైంది
ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్‌కు నీళ్లు
హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
హుస్నాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. పల్లెల్లో పట్టు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్థుల్లో నింపే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చామంటూ సీఎం సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌త్‌రెడ్డి మొదట హుస్నాబాద్‌కు మంజూరైన ఇంజినీర్ కళాశాలకు రూ.45 కోట్లు మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ ఇటీవల అమెరికాలో పర్యటించగా, అక్కడ ఓ ఎన్నారై అందించిన 70 సైకిళ్లను సీఎం చేతిలో మీదుగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన పార్టీ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసిన ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందుతుందని తెలిపారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్‌లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వకుండా సీఎం నిరాశపరిచారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, గడ్డం వివేక్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో జోష్!


