అన్ని మున్సిపాల్టీలకు వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని మున్సిపాల్టీలకు వర్తింపజేయాలి

Mar 10 2026 12:52 PM | Updated on Mar 10 2026 12:52 PM

అన్ని మున్సిపాల్టీలకు వర్తింపజేయాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో అమలు చేస్తున్న వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) పథకాన్ని కేవలం అక్కడికే పరిమితం చేయడంపై కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై ఈనెల 31 వరకు 90 శాతం రాయితీతో పాటు 5 శాతం వడ్డీ మినహాయింపు కల్పిస్తూ ఓటీఎస్‌ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండడం స్వాగతించదగ్గ విషయమేనని పేర్కొన్నారు. అదే పథకాన్ని కరీంనగర్‌ నగరపాలక పరిధిలో కూడా అమలు చేస్తే వేలాది కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇతర పట్టణాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement