కరీంనగర్‌సిటీ: మహిళలే దేశానికి ఆయువుపట్టు అని శాతవాహన రిజిస్ట్రార్ ఆచార్య సతీశ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విశ్వవిద్యాలయంలో ఉమెన్స్ సెల్–జాతీయ సేవా పథకం సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో వేడుకలు నిర్వహించారు. మహిళా సెల్ సంచాలకులు డాక్టర్ నమ్రత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథి గైనకాలజిస్ట్ నయనీ వింజమూరి మాట్లాడుతూ, ఆధునిక సమాజంలో కూడా మహిళలపై జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించాలన్నారు. లింగ సమానత్వం కోసం పోరాడాలని, ఆధునిక మహిళ ఆకాశమే హద్దుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ డాక్టర్ హరికాంత్ తదితరులు పాల్గొన్నారు.


