బల్దియాలో ప్రజావాణి షురూ | - | Sakshi
Sakshi News home page

బల్దియాలో ప్రజావాణి షురూ

Mar 10 2026 12:52 PM | Updated on Mar 10 2026 12:52 PM

బల్దియాలో ప్రజావాణి షురూ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కా ర్యాలయంలో సోమవారం ప్రజావాణి ప్రారంభమైంది. కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ 23 దరఖాస్తులు స్వీకరించారు. నగరంలోని 44వ డివిజన్‌ సప్తగిరికాలనీలో నగరపాలకసంస్థ వాహన షెడ్‌ కారణంగా ఆ ప్రాంత ప్రజలు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. అలాగే చాలా మంది సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడారుతూ, నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. నగ రపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement