సమస్య ఆలకించి.. పరిష్కారానికి ఆదేశించి | - | Sakshi
Sakshi News home page

సమస్య ఆలకించి.. పరిష్కారానికి ఆదేశించి

Mar 10 2026 12:52 PM | Updated on Mar 10 2026 12:52 PM

సమస్య ఆలకించి.. పరిష్కారానికి ఆదేశించి ● ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ ● ప్రతీ అర్జీని తేల్చాల్సిందే : కలెక్టర్‌ చిత్రా మిశ్రా ● 352 దరఖాస్తులు స్వీకరణ తెలియకుండా పేర్ల మార్పు రెండేళ్లుగా తిరుగుతున్నం బ్లూకోల్ట్స్‌ పోలీసులు బెదిరిస్తుండ్రు

కదిలొచ్చిన కలెక్టర్‌

మొత్తం అర్జీలు: 352, ఎక్కువగా మున్సిపల్‌ కార్పొరేషన్‌: 71

హౌజింగ్‌: 55, కరీంనగర్‌రూరల్‌ తహసీల్దార్‌: 23

డీపీవో: 21, ఆర్డీవో, కరీంనగర్‌: 17, వారధి: 09

నాకు గ్రామంలోని 500, 511ఎ, 511బీ సర్వే నంబర్లలో 4.37ఎకరాల భూమి ఉంది. కన్న కొడుకే నన్ను హింసించడం, తల్లిదండ్రి అనే ప్రేమ లేకుండా నిర్దయగా వ్యవహరించగా నా కూతురిని కూడా హింసించారు. నా భూమిని నా ప్రమేయం లేకుండా రికార్డులో నా కొడుకు భార్య పేరున, అతడి కూతురి పేరున మార్చారు. ఇదెక్కడి అన్యాయమని అధికారులను కలిస్తే పట్టించుకోవడం లేదు.

– కె.రఘుపతిరెడ్డి, రేణికుంట, తిమ్మాపూర్‌

మా కూతురు వయసు 12 సంవత్సరాలు. లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోయాం. కానీ, క్రమేణా ఆమె మానసిక సమస్య బాధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా మానసికంగా సరిగా ఉండడం లేదు. ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేయడం లేదు. మానసిక వికలాంగురాలిగా వైద్యులు వందశాతం ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్‌ జారీ చేశారు. అయినా కార్యాయాల చుట్టూ తిరుగుతున్నాం. – కూతురుతో జమున,

బావుపేట, కరీంనగర్‌రూరల్‌

కరీంనగర్‌అర్బన్‌: ప్రతీ అర్జీని పరిష్కరించాల్సిందే.. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ పరిష్కారం కాని సమస్య అయితే కాదని ఫిర్యాదుదారుకు చెప్పండి. వచ్చిన ఫిర్యాదు మళ్లీ మళ్లీ వస్తే ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదంటూ కలెక్టర్‌ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దని, శాఖల వారీగా సమీక్షిస్తానని చెప్పారు. అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..

మేము కొన్నేళ్లుగా నగరంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్నాం. ఉదయం 5.30గంటలకు గ్రౌండ్‌కు చేరి కసరత్తు చేస్తాం. కానీ, బ్లూకోల్ట్స్‌ పోలీసులు వచ్చి మమ్మల్ని తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇక్కడెందుకు చేస్తున్నారంటూ బెదిరిస్తున్నారు. మైదానంలో వ్యాయామం చేస్తే ఇవేం బెదిరింపులు.? – లక్ష్య గోపిచంద్‌ అకాడమీ విద్యార్థులు

దివ్యాంగుల సమస్యలపై కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా ప్రత్యేక దృష్టిసారించారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి ప్రజావాణి వరకు వీల్‌చైర్‌ ద్వారా తీసుకొచ్చేలా సిబ్బందిని, ప్రజావాణిలో వారి కోసం కుర్చీలను ఏర్పాటు చేశారు. కలెక్టరే స్వయంగా వారి వద్దకొచ్చి అర్జీలు స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement