న్యాయవాదులు మార్గదర్శకులుగా ఉండాలి
కరీంనగర్‌క్రైం: న్యాయవాదులు మేధావులని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించిన న్యాయవాదుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయవాది అన్నింటిపై అవగాహన కలిగి ఉంటారన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ మాట్లాడారు. ఆటలపోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందించారు.
కరీంనగర్: రాజకీయ అవసరాల కోసం, హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ, హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణచౌక్‌లో నిరసన తెలిపారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులను చులకన చేసి మాట్లాడారని, ఆ వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్పిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని, అందుకే హిందూ సమాజంతో పెట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. మూడు కోట్ల దేవతలంటూ.. ఒక్కో దేవునిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. గుగ్గిళ్లపు రమేశ్, వాసాల రమేశ్, కళ్లెం వాసుదేవరెడ్డి, గువ్వల శ్రీనివాస్, కటకం లోకేశ్, పాదం శివరాజ్, బండారు గాయత్రి, తణుకు సాయికృష్ణ, జాడి బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఏలు విడుదల చేయాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నగరంలో సత్కరించారు. ఈ సమావేశానికి వరంగల్, కరీంనగర్ సర్కిల్ నుంచి రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ అధికారులు హాజరయ్యారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఉన్నతాధికారులు బి.శ్రీనివాస్, దాసరి నాగభూషణం, జి.నర్సయ్య, వుచ్చిడి మోహన్‌రెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.
న్యాయవాదులు మార్గదర్శకులుగా ఉండాలి


