
పొలంలో పడి రైతు దుర్మరణం
ముస్తాబాద్(సిరిసిల్ల): పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన తండ్రీకొడుకుల్లో ప్రమాదవశాత్తు కొడుకు ప్రాణాలు కోల్పోవడం పోత్గల్‌లో విషాదం నింపింది. ఏఎస్సై అశోక్‌కుమార్, మృతుని కుటుంబికులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన కొప్పు శివరాజు(52) సోమవారం తండ్రి కిష్టయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలోకి దిగిన శివరాజు ప్రమాదవశాత్తు కాలు జారి అందులోనే పడిపోయాడు. శివరాజు ముఖం బురదలో చిక్కుకుపోయింది. కొద్ది దూరంలో ఉన్న తండ్రి కిష్టయ్య గమనించి వచ్చి కొడుకును లేపే సరికి ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే కొడుకు మృతి చెందడంతో తండ్రి కిష్టయ్య రోదనలు మిన్నంటాయి. మృతుని భార్య మణెమ్మ, తల్లి రాజమణి, కుమారుడు, కుమార్తెలు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.
మల్యాల: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు మృతిచెందాడు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి గ్రామానికి చెందిన ఎనుగందుల గంగారాం(75) సోమవారం నూకపల్లి శివారులోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. చాతిలో నొప్పి రావడంతో పొలంలో బోర్లా పడి బురదలో ఊపిరాడక మృతిచెందాడు. 3 రోజులుగా చాతి నొప్పితో బాధపడుతున్నాడని మృతుడి భార్య కాంతవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇద్దరు కుమారులు గల్ఫ్‌లో ఉండగా.. మృతుడి దహన సంస్కారాలు మంగళవారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

పొలంలో పడి రైతు దుర్మరణం

పొలంలో పడి రైతు దుర్మరణం

పొలంలో పడి రైతు దుర్మరణం