
రామగుండం: తిరుపతికి వెళ్లేందుకు పెద్దపల్లి జంక్షన్ నుంచి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తుందని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మపురం నుంచి తిరుపతి, మహారాష్ట్రలోని నాందేడ్, పెద్దపల్లి జంక్షన్‌తోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని రైల్వేస్టేషన్ల ద్వారా ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబరులో రాకపోకలు సాగిస్తుంది. సెప్టెంబర్‌లో 5, 12, 19, 26 తేదీల్లో తిరుపతి వైపు, సెప్టెంబర్ 7, 14, 21, 28వ తేదీల్లో పెద్దపల్లి వైపు నడవనుంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో బుకింగ్ సౌకర్యం ప్రారంభమైంది. ఇందులో నాలుగు సాధారణ, ఏడు స్లీపర్, ఆరు థర్డ్ ఏసీ, మూడు సెకండ్ ఏసీ బోగీలతోపాటు ఒకటి దివ్యాంగుల బోగీ ఉంటుంది. దీనికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తే రెగ్యులర్‌గా నడిపించే అవకాశాలు ఉన్నాయి.
రైలు రాకపోకల వివరాలు..
రైలు నంబరు : 07189 : నాందేడ్ – ధర్మవరం : ప్రతీ శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, 6.00 గంటలకు బాసర, రాత్రి 6.25గంటలకు నిజామాబాద్ జంక్షన్, రాత్రి 8.00 గంటల జగిత్యాల, రాత్రి 9.00 గంటలకు కరీంనగర్, రాత్రి 10.15గంటలకు పెద్దపల్లి జంక్షన్, రాత్రి 11.40 గంటలకు వరంగల్, మరుసటిరోజు వేకువజామున 4.10 గంటలకు విజయవాడ జంక్షన్, ఉదయం 11గంటలకు తిరుపతి, ఉదయం 11.50 గంటలకు చిత్తూరు జిల్లా పాకాల జంక్షన్, మధ్యాహ్నం 12.30 గంటలకు పీలేరు, మధ్యాహ్నం 1.15 గంటలకు మదనపల్లి రోడ్డు, మధ్యాహ్నం 2.30 గంటలకు కదిరి, సాయంత్రం 5.00 గంటలకు ధర్మవరం జంక్షన్‌కు చేరుకుంటుంది.
రైలు నంబరు : 07190 : ధర్మవరం – నాందేడ్ : ప్రతీ ఆదివారం ఉదయం 5.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరుతుంది. ఉదయం 6.30 గంటలకు కదిరి, మదనపల్లిరోడ్డుకు ఉదయం 7.30గంటలు, పీలేరుకు ఉదయం 8.30 గంటలు, పాకాల జంక్షన్‌కు ఉదయం 9.30గంటలు, తిరుపతికి ఉదయం 10.25 గంటలు, విజయవాడ జంక్షన్‌కు సాయంత్రం 6.35గంటలు, వరంగల్‌కు రాత్రి 10.20 గంటలు, పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 12.05గంటలు, కరీంనగర్‌కు రాత్రి 12.40గంటలు, జగిత్యాలకు రాత్రి 1.30గంటలు, నిజామాబాద్ జంక్షన్‌కు వేకువజామున 3.50గంటలు, బాసరకు ఉదయం 4.27 గంటలు. నాందేడ్‌కు ఉదయం 7.30గంటలకు చేరుకుంటుంది.