
ఫీజు బకాయిల కోసం పోరాటం
● ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్స్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి అధ్వర్యంలో గురువారం చలో కలెక్టరేట్ చేపట్టారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్లగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రభుత్వం మారినా విద్యార్థుల బతుకులు మారడం లేవన్నారు. మొత్తం రూ.8,158 వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో చదువుకోవా ల్సిన విద్యార్థులు రోడ్డెక్కి ఉద్యమించే పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రామారావు వెంకటేశ్, మచ్చ రమేశ్, ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్, రాముయాదవ్ పాల్గొన్నారు.