
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
చొప్పదండి: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రి య అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం మండలంలోని పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 78వేలకు పైగా నూతన రేషన్ కార్డులు మంజూ రు కాగా, చొప్పదండి నియోజకవర్గంలో నాలు గు వేల కార్డులు అందిస్తున్నామని తెలిపారు. నూతన రేషన్ కార్డు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతోందని, గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగులో అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. తహశీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, ముద్దం మహశ్ గౌడ్, గుర్రం భూంరెడ్డి, గుర్రం రాజేందర్ రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం