
● ఉత్తమ జాతీయ పంచాయతీకి రూ.కోటి బహుమతి ● ఆన్‌లైన్‌లో పల
‘ఉత్తమ’ అవార్డుకు పోటీ
కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీల ఎంపికకు పోటీలు నిర్వహిస్తోంది. ఎంపికై న మొదటి ఉత్తమ గ్రామపంచాయతీకి రూ.కోటి, రెండో పంచాయతీకి రూ.75 లక్షలు, మూడో పంచాయతీకి రూ.25 లక్షల నగదు పురస్కారం అందిస్తోంది. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్(పీఏఐ) యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముందుగా గ్రామపంచాయతీ, మండల, జిల్లాస్థాయిలో పూర్తి చేస్తారు. ప్రధానంగా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు, తాగునీరు, ఆరోగ్యం, సౌకర్యాలు, ప చ్చదనం, పరిశుభ్రత, భద్రత, సామాజిక న్యాయం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తున్నారు. జిల్లా నుంచి తొమ్మిది అంశాల్లో ప్రతిభను ప్రదర్శించిన తొమ్మిది పంచాయతీలను రాష్ట్రస్థాయికి పంపిస్తారు. ఆయా విభాగాల్లో ఎక్కువ మార్కులు సాధించిన తొమ్మిది పంచాయతీలను రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామపంచాయతీస్థాయిలో పీఏఐలో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సమాచారాన్ని నమోదు చేస్తున్నట్లు డీపీవో జగదీశ్వర్ తెలిపారు.
దరఖాస్తులు ఆహ్వానం
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరం పదకొండో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మంగతాయారు కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష రాయకపోయినా, నవోదయ వెబ్‌సైట్‌లో ఫాం డౌన్‌లోడ్ చేసుకొని, పూరించి విద్యాలయంలో స్వయంగా గాని, మెయిల్ ద్వారా గాని పంపవచ్చని తెలిపారు. పూర్తి చేసిన ఫారాలను ఆగస్టు 10లోగా పంపించాలని సూచించారు. వివరాలకు నవోదయ వెబ్‌సైట్ సంప్రదించాలని కోరారు.