
చేయకండి
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
ఆ ఇళ్లకు రిజిస్ట్రేషన్లు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు రద్దు.. అది కూడా కేవలం రెండు నెలల కాలంలో. అదీ రిజిస్ట్రేషన్లశాఖ అధికా రులు కళ్లు మూసుకుని.. మామూళ్ల మత్తులో చేసిన ఘనకార్యాలే. కొత్తపల్లి పరిధిలోని ప్రభుత్వ భూమిని గంగాధర సబ్‌రిజిస్ట్రా ర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన 476 పట్టాలు రద్దయిన విషయం మరుకముందే.. మరో 202 రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ కరీంనగర్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్లశాఖకు లేఖ రా యడం కలకలం రేపుతోంది. ఇటీవల కొత్తపల్లి మండలంలోని సర్వే నంబరు 272/14లో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు గురైన విషయం మరవకముందే.. తాజాగా అక్రమ పద్ధతుల్లో ఇంటినంబర్లను ఆసరాగా చేసుకుని వచ్చే 202 మందికి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ గంగాధర, కరీంనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మున్సిపల్ కార్పొరేషన్ లేఖ రాసింది.
న్యూస్‌రీల్
ఇటీవల ‘సాక్షి’లో ప్రచురించిన కథనం

చేయకండి

చేయకండి