
విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి
హుజూరాబాద్: వానాకాలంలో వ్యాధులు సంక్రమించకుండా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఎంజేపీ జాయింట్ సెక్రటరీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ సూచించారు. పట్టణ శివారు కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో బాధపడితే, వెంటనే హాస్టల్ అధికారులకు తెలియజేయాలన్నారు. పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని సూచించారు. అనంతరం వసతిగృహాల్లో అందుతున్న సదుపాయాల గురించి ఆరా తీశారు.
సింగిల్ విండో విధానంలో హెచ్‌టీ సర్వీసులు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సర్కిల్ పరిధిలో 11, 33 కె.వీ.హెచ్‌టీ సర్వీసులను ఇకపై సింగిల్ విండో విధానంలో వేగవంతంగా మంజూరు చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లో బుధవారం వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్‌టీ సర్వీసుల మంజూరును మరింత సరళీకృతం చేసేందుకు మానిటరింగ్ సెల్‌ను సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 కేవీ ఓల్టేజీ హెచ్‌టీ దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్‌లో ఏడీఈ(కమర్షియల్), 33 కేవీ ఓల్టేజీ ఆపైన వాటి దరఖాస్తులను ఏడీఈ/ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు. ఈ కొత్త విధానం ద్వారా మొదట వినియోగదారులు టీజీఎన్‌పీడీసీఎల్ వెబ్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో హెచ్‌టీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఈ కోరారు.
వైద్య పరీక్షలు, స్కానింగ్‌పై 40 శాతం రాయితీ
కరీంనగర్‌టౌన్: పేదలకు మోయలేని భారంగా మారుతున్న వైద్య పరీక్షలు, స్కానింగ్‌పై 40శాతం రాయితీ ఇ ప్పించేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం చేసినట్లు బీఎన్‌రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీఎన్‌రావు తెలిపారు. బుధవారం నగరంలోని ఫౌండేషన్ కార్యాలయంలో మాట్లాడుతూ.. నిరుపేదలు అనారోగ్యం పాలైన సమయంలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు వస్తే రక్తపరీక్షలు, ఎంఆర్‌ఐ, సిటిస్కానింగ్‌ల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి వైద్యులకు కమీషన్లు ముట్టజెబుతూ పేషెంట్ల జేబులు గుళ్ల చేస్తున్నారని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రోగాలు వస్తే ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. ఇలాంటి పరిస్థితిని దూరం చేసి పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు నగరంలోని విజయ, సాయిరాజా, కేసీ డయగ్నోస్టిక్ సెంటర్లను సంప్రదించగా వారు బీఎన్‌రావు ఫౌండేషన్ ద్వారా 40శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. నిరుపేదలు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తపరీక్షలు, స్కానింగ్ అవసరమైన వారు 8331875779, 9866842211 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కొనసాగుతున్న నవోదయ క్రీడా పోటీలు
చొప్పదండి: జవహర్ నవోదయ హైదరాబాద్ రిజియన్ ఖోఖో పోటీలు నేడు ముగియనున్నా యి. సుమారు 560 మంది క్రీడాకారులు ఎని మిది క్లస్టర్లు, నాలుగు రాష్ట్రాల నుంచి రీజి యన్ ఖోఖో పోటీల్లో పాల్గొనగా, బుధవారం అండర్–19 బాలుర విభాగంలో బీదర్ వర్సెస్ ఖమ్మం, తుమ్‌కూర్ వర్సెస్ కడప, అండర్–17 బాలుర విభాగంలో బీదరు వర్సెస్ కడప, తుముకూర్ వర్సెస్ కృష్ణ, అండర్ –17 బాలి కల విభాగంలో బీదర్ వర్సెస్ కడప, అండర్–19 విభాగంలో తుముకూరు వర్సెస్ కడప జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. గురువా రం సెమీ ఫైనల్స్, ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు.

విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి

విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి