
స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో నాల్గో తరగతిలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంపిక పోటీల్లో భాగంగా బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మొదలయ్యాయి. పోటీలను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్‌కు క్రీడాపాఠశాలలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. జిల్లాలోని 16 మండలాల నుంచి సుమారు 70 మంది విద్యార్థులు హాజరయ్యారని, పోటీలకు హాజరైన విద్యార్థుల ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లై?్యంగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, షటిల్ రన్, మెడిసన్ బాల్‌త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. ఎంపిక పోటీల్లో ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, మండల కార్యదర్శులు అంతటి శంకరయ్య, గిన్నె లక్ష్మణ్, బాబు శ్రీనివాస్, రొండి నర్సయ్య, బాబు శ్రీనివాస్, కొమురోజు కృష్ణ, కనకం సమ్మయ్య, దత్తాత్రి, సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఆడేపు శ్రీనివాస్, కోచ్‌లు కిష్టయ్య, పవన్, సాయిరాం, మల్లిక, శ్యామ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.