
పోలీసుల అదుపులో లక్కీ డ్రా నిర్వాహకులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘కాయ్ రాజా కాయ్’ అంటూ లక్కీడ్రా పేరుతో ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్న కేటుగాళ్లను తంగళ్లపల్లి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి పక్కన శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు లక్కీడ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై సుధాకర్.. పోలీస్ సిబ్బందిని పంపించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఎస్సై ముఖీద్ సిబ్బంది పాల్గొన్నారు.