Telangana News: ‘బలగం’ మూవీ.. సర్పంచ్‌కు కన్నీటి వీడ్కోలు..!
Sakshi News home page

‘బలగం’ మూవీ.. సర్పంచ్‌కు కన్నీటి వీడ్కోలు..!

Sep 7 2023 1:36 AM | Updated on Sep 7 2023 9:26 AM

- - Sakshi

కరీంనగర్: బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించిన కీసరి నర్సింగం అంత్యక్రియలు బుధవారం అభిమానుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం కొన్నేళ్లుగా నాటక ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల వేణు డైరెక్షన్‌లో వచ్చిన బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించి అందరి ప్రశంసలు పొందారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్‌, కూతురు అంజలి ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌, వైఎస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, డీపీఆర్వో మామిండ్ల దశరథం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, సర్పంచ్‌ లావణ్య–శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రా వు, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్‌, నాయకులు రాఘవరెడ్డి, పిట్టల భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement