లింగంపేట బీసీ కాలనీలో సంచరిస్తున్న కుక్కలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో వీధి కుక్కల బెడదతో గ్రామస్తులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీ, బస్టాండు, ఎల్లమ్మ ఆలయం, పాత ఐవోబీ బ్యాంకు, మాసుల్దార్ గల్లీ, మెంగారం గైనీ, మోతైగెనీ, పాత రాఘవ మెడికల్ తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు గుంపులు, గుంపులుగా చేరి స్వైర విహారం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహన చోదకుల వెంటపడుతున్నాయి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారు కుక్కలను దాటి వెళ్లాలంటే జంకుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


