తాడ్కోల్‌ గ్రామంలో స్వచ్ఛభారత్‌ | - | Sakshi
Sakshi News home page

తాడ్కోల్‌ గ్రామంలో స్వచ్ఛభారత్‌

Oct 3 2026 1:08 AM | Updated on Oct 3 2026 1:08 AM

తాడ్కోల్‌ గ్రామంలో స్వచ్ఛభారత్‌ మద్నూర్‌లో వైద్య శిబిరం పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి ప్రాణం ఖరీదు రూ. 50 వేలు?

బాన్సువాడ రూరల్‌: మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో శుక్రవారం సర్పంచ్‌ అందె రమేశ్‌ ఆధ్వర్యంలోస్వచ్ఛభారత్‌ నిర్వహించారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని గ్రామ పంచాయతీ వద్ద వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి రోడ్డు ఊడ్చారు. గ్రామస్తులు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉప సర్పంచ్‌ సాజిద్‌, కార్యదర్శి భరత్‌కుమార్‌, నాయకులు మధుసూదన్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మద్నూర్‌: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకోని నిర్వాహకుడు, దళిత నాయకుడు, ప్రజా సేవకుడు సూర్యవంశీ యాదవ్‌రావ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బాన్సువాడలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా సర్పంచ్‌ మచ్కురీ ఉషా సంతోష్‌ మేసీ్త్ర, దళిత నాయకుడు, ప్రజా సేవకుడు సూర్యవంశీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోగులు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహకుడు సూర్యవంశీ మాట్లాడుతు ప్రతి నెల జుక్కల్‌ నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తానన్నారు. వైద్యులు వాగ్దేవి, దివ్య భవాని, శ్రీనివాస్‌, హన్మంత్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌: మండల కేంద్రంలో కెనరా బ్యాంక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్వ చ్ఛభారత్‌ , మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ట్రైనింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ అమర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. గాంధీ కలలుగన్న స్వచ్ఛతను, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని పిలుపునిచ్చారు. ట్రైనింగ్‌ సెంటర్‌ ఎదుట పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు.అధ్యాపకులు జీవన్‌ నాయక్‌, సూర్య తేజ, డీఎస్‌టీ సత్య సూర్యమణి, సార్థిక, శ్రీకాంత్‌, శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.

రెంజల్‌:మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పనుల కో సం వెళ్లిన బాలుడు మృతి చెందడంతో రూ. 50 వేలకు ప్రాణం ఖరీదుగా సంబంధిత ట్రా క్ట ర్‌ యజమాని నిర్ణయించారు. వివరాలిలా ఉ న్నాయి. గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్‌ యజ మాని వద్ద అదే గ్రామానికి చెందిన బాలాజీ (15) అనే బాలుడు పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పనిచేసే ప్రాంతం సమీపంలో ఉ న్న కాలువ నుంచి నీరు తీసుకు రావాలని య జమాని చెప్పాడు. దీంతో కాలువలోకి దిగిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని యజమానిని కోరగా రూ. 50 వేలు అందిస్తామని చెప్పాడు. ఈ విషయమై ఎస్సై గంగాధర్‌ను వివరణ కోరగా మృతుడి తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement