లీజ్‌కు ఇవ్వడంతో..
నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి
● ఒక్కొక్కటిగా మూతపడుతున్న థియేటర్లు
● ఎల్లారెడ్డి నియోజకవర్గంలో
ఏడింటిలో ఒకటే రన్నింగ్
ఎల్లారెడ్డి:ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలకు వినోదానికి ప్రధాన వేదికగా నిలిచిన సినిమా థియేటర్లు ప్రస్తుతం ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్ల వద్ద సందడి నెలకొనేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచులు, వినోద సాధనాల్లో వచ్చిన మార్పులతో సిని మా హ్లాళకు ఆదరణ తగ్గుతోంది. దీంతో థియేటర్ల నిర్వహణ భారంగా మారి యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి.
కారణాలు ఎన్నో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిలో(లక్ష్మి, ప్రి య), గాంధారిలో(అన్నపూర్ణ, నటరాజ్), నాగిరెడ్డి పేటలో (వెంకటేశ్వర, రామ్‌ప్రతాప్), లింగంపేట లో (శాంతి) థియేటర్లు ఉండేవి. ప్రస్తుతం నాగిరెడ్డి పేట లో రామ్‌ప్రతాప్ థియేటర్ మాత్రం అప్పుడప్పుడు న డుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సై తం (కమల్, సుభాష్, రమేశ్) రెండు, మూడు థియేటర్లు మూత బడ్డాయి. థియేటర్లలో పెరుగుతు న్న నిర్వహణ ఖర్చులు, మారుతున్న ప్రేక్షకుల వినోదపు అలవాట్లు, ఓటీటీల విస్తరణ, కొత్త సినిమాల విడుదలలో అంతరాలు, తదితర కారణాలతో థి యేటర్లు తీవ్ర ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కొంటు న్నాయని థియేటర్ల యజ మానులు అంటున్నారు. కొన్నిచోట్ల ఽథియేటర్లు తాత్కాలికంగా మూతబడగా చాలా చోట్ల శాశ్వతంగా మూతబడుతున్నాయి. థియేటర్లలో పెరుగుతున్న నిర్వహణ ఖర్యులు,మారుతున్న ప్రేక్షకుల అభిరుచు లు, ఓటీ టీలు కొత్త సినిమాలు విడుదలైన కొద్ది రో జుల్లోనే డిజ టల్ వేఇకల్లో అందుబాటులోకి రావడం వంటి అంశాలు థియేటర్లపై ప్రభావం చూపుతున్నా యి. దీంతో కొన్ని చోట్ల థియేటర్లు పూర్తిగా మూతపడగా..మరికొన్ని చోట్ల ఇతర వ్యాపారాలకు మారుతున్నాయి.
ఓటీటీ ప్రభావం..
సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ వేదికల్లో అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకులు ఇంటి వద్దే సినిమాలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమా టికెట్‌లతో పాటు ప్రయాణం, పార్కింగ్, తినుబండారాల ఖర్చులు కలిపి కుటుంబంతో థియేటర్‌కు వెళ్లడం భారంగా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. దీనికి తోడు డిజిటల్ వేదికలు, మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది.
ఎల్లారెడ్డిలో నడుస్తున్న ఒకే థియేటర్
సినిమా థియేటర్‌ను యాజమాన్యాలు సొంతంగా నడిపించే పరిస్థితి లేకుండాపోయింది. మా థియేటర్‌ను డిస్ట్రిబ్యూటర్ కు లీజ్‌కు ఇవ్వడం వల్ల ఆగు తూ ఆగుతూ నడుస్తోంది. థియేటర్‌ను నడిపించాలంటే ఖర్చులు భయపెడుతున్నాయి.
–ప్రతాప్‌రెడ్డి, ఽథియేటర్ యజమాని, నాగిరెడ్డిపేట
మన రాష్ట్రంలోనూ కర్ణాటక లా గా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్, షేరింగ్ విధానం అమలు చే యాలి. ఈ విధానం లేనందున నాకున్న 6 సినిమా హాళ్లను మూసి వేయాల్సి వచ్చింది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
–సుభాష్‌గౌడ్, థియేటర్ల యజమాని, ఎల్లారెడ్డి


