పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం

Oct 3 2026 1:08 AM | Updated on Oct 3 2026 1:08 AM

పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం

రామారెడ్డి: పాత కక్షలతో ఒకరిపై హత్యాయత్నం జ రిగిన ఘటన రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూనోళ్ల మధుసూదన్‌కు అదే గ్రామానికి చెందిన బండారి బీరయ్యతో పాత కక్షలు ఉన్నాయి.ఈ నెల 30న ఫోన్‌ చేసి మాట్లాడుదామని ఎల్లమ్మ ఆలయ సమీపానికి రావాలని మధుసూదన్‌ను పిలిచారు. అక్కడికి వచ్చిన వెంటనే శాగ రాములు, రామొళ్ల బీరయ్య, చింతకింది చిన్న మహిపాల్‌, చింతకింది మల్లేశ్‌, బండారి బీరయ్య అతనిపై కట్టెలు, కత్తితో దాడి చేశారు. కత్తితో గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించారు. వెంటనే అతను పరుగెత్తి గ్రామస్తులకు చెప్పడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

● ఐదుగురు నిందితుల అరెస్ట్‌

● రామారెడ్డిలో వెలుగు చూసిన ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement