కామారెడ్డిలో ది చైన్నె షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ది చైన్నె షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Oct 3 2026 1:08 AM | Updated on Oct 3 2026 1:08 AM

● ప్రముఖ నటి శ్రీముఖి రాకతో సందడి చేసిన అభిమానులు

కామారెడ్డి టౌన్‌ : ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘ది చైన్నె షాపింగ్‌ మాల్‌ జిల్లా కేంద్రంలో శుక్రవా రం వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజలకు సరికొత్త ఫ్యాషన్‌ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సంస్థ తన 36వ షోరూంను అట్టహాసంగా ప్రా రంభించింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణ గా నిలవగా, ఆమెను చూసేందుకు అభిమాను లు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చా రు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

వినియోగదారుల నమ్మకానికి చిరునామా

మాల్‌ ప్రారంభించిన అనంతరం నటి శ్రీముఖి మాట్లాడుతూ.. కామారెడ్డి ప్రజల ముంగిటకు అ త్యాధునిక డిజైన్లు, సంప్రదాయ వస్త్ర శ్రేణిని తీసుకొచ్చిన ది చైన్నె షాపింగ్‌ మాల్‌లో కుటుంబ సమేతంగా షాపింగ్‌ చేయాలని కోరారు. వినియోగదారుల నమ్మకానికి చిరునామాగా నిలిచి న ఈ మాల్‌ను ప్రజలు ఆదరించాలని, రాబోయే పండుగలు, శుభకార్యాల్లో ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. తాను ఇక్కడి నిజామాబాద్‌ బిడ్డనేనని గుర్తు చేసుకుంటు సందడి చేశారు. శ్రీముఖి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చా రు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలతో అభిమానులతో సందడి నెలకొంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లక్షలాది సరికొత్త డిజైన్లు ఒకే గొడుగు కింద లభించడం పట్టణ ప్రజలకు గొప్ప అవకాశమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దసరా, దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌ వేళ షోరూమ్‌ అందుబాటులోకి రావడం వినియోగదారులకు ఎంతో వెసులుబాటు కల్పించామన్నారు. కార్యక్రమంలో మర్రి రిటైల్‌ లిమిటె డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మర్రి వెంకటరెడ్డి, డైరెక్టర్‌ కృష్ణారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారా ణి, వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరి, కౌన్సిలర్‌ కుంట లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement