రాజంపేట(భిక్కనూరు): మండల కేంద్రంలో రెండో విడత 17 మంది లబ్ధిదారులకు ఇందిమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబిద్ధారులకు ఇళ్ల ధ్రువీకరణపత్రాలను సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు అందజేశారు. సర్పంచ్ శ్రీకాంత్,కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుధాకర్‌రెడ్డి, దుబ్బల దుర్గం, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాబు, నేతలు కటికే బాలాజీ,,కొప్పుల నరేశ్, అంద్యాల రమేశ్, సురేశ్, తొడింగల సిద్దరాములు,పందల స్వామి,పుట్ట గణేశ్, జమీల్, దొబ్బల ప్రవీణ్, ఆకుల రాజిరెడ్డి, నందం తదితరులు పాల్గొన్నారు.
బోధన్: ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌పై దాడి చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ ఖలీద్ తన కుటుంబంతో కలిసి దర్గా వద్ద టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 30న షేక్ ఇస్మాయిల్, షేక్ జావీద్, షేక్ బాణిగి, షేక్ అహ్మద్, షేక్ లయాకత్‌లతో పాటు మరికొందరు గుంపుగా వెళ్లి టిఫిన్ సెంటర్‌ను ఖాళీ చేయాలని గొడవకు దిగారు. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు షేక్ ఖలీద్ పై దాడి చేసి దుర్భాషలాడారు. లోపల సామాగ్రిని ధ్వంసం చేసి తీసుకెళ్లారు. దాడి దృశ్యాలను వీడియో రికార్డు తీస్తుండగా బెదిరింపులకు దిగారు. బాధితుడు బోధన్ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఎడపల్లి పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.


