రాయితీ సరే.. స్పందనేదీ? | - | Sakshi
Sakshi News home page

రాయితీ సరే.. స్పందనేదీ?

Jul 1 2026 1:58 AM | Updated on Jul 1 2026 1:58 AM

రాయితీ సరే.. స్పందనేదీ? దరఖాస్తుదారులు స్పందించాలి

బల్దియా ఖజానాకు రూ. కోట్లలో ఆదాయం

కామారెడ్డి టౌన్‌ : అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)కు కామారెడ్డి మున్సిపాలిటీలో స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 25శాతం రాయితీ ఇస్తూ జూలై 31వ తేదీని గడువుగా ప్రకటించినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది.

17వేలకు పైగా దరఖాస్తులు..

పరిష్కారమైంది 3,408

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు మొత్తం 17,613 అందగా, వాటిలో ఇప్పటివరకు కేవలం 3,408 దరఖాస్తులను పరిష్కరించి ప్రొసిడింగ్‌ కాపీలు అందించారు. మరో 7,575 దరఖాస్తులు మున్సిపల్‌ అధికారుల లాగిన్‌లో ఉండిపోయాయి. ఆ దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. అయితే అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 4600 మంది దరఖాస్తుదారులకు ఫీజు సమాచారం ఇవ్వగా వారు స్పందించినా మొత్తం ఫీజును చెల్లించకపొవడంతో పెండింగ్‌లో ఉన్నాయి. షార్ట్‌ఫాల్స్‌ 648, తిరస్కరణకు గురైనవి 593, నిషేధిత జాబితాలో ఉన్నవి 789 దరఖాస్తులున్నాయి. ఫీజులు చెల్లించినా ఇంకా ప్రొసిడింగ్‌ కాపీల కోసం మరి కొందరు ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం, మున్సిపల్‌ శాఖ మరోమారు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించుకునేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికై న దరఖాస్తుదారులు స్పందించాలి. లేనిపక్షంలో అనధికార లే అవుట్‌లు, ప్లాట్లకు ఇంటి అనుమతులు రావు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– వినిత్‌, టీపీవో, మున్సిపల్‌, కామారెడ్డి

అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరీ లక్షలాది రూపాయల ఫీజులను ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. దీని ద్వారా మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ. 12 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మిగిలిన దరఖాస్తులను పరిష్కారం చూపితే ఇంకా భారీగా ఆదాయం సమకూరనుంది. దరఖాస్తులను పరిష్కరించడంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఘోరంగా విఫలమవుతోందని విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జూలై 31 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికై నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న 7,575 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాల్సి ఉంటుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు అంతంతే స్పందన

జూలై 31 వరకు 25శాతం

రాయితీతో అవకాశం

జిల్లాలో ఇంకా 7,575

దరఖాస్తులు పెండింగ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement