విద్యుత్‌రంగ కార్మికులను వేధిస్తే ఊరుకోబోం.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌రంగ కార్మికులను వేధిస్తే ఊరుకోబోం..

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

కామారెడ్డి టౌన్‌ : విద్యుత్‌ రంగ కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని తెలంగాణ యునైటేడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీఎస్‌ఈఈ యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన యూనియన్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్‌ యూ నియన్‌లకు చెందిన పలువురు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు యూనియన్‌లో చేరగా వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. విద్యుత్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో సీఐటీయూ, టీఎస్‌ఈఈయూ ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంఘం అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, అధ్యక్షుడు గంగాధర్‌, కార్యద ర్శి మోహన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులు నర్సాగౌడ్‌, బాలరాజు, లైన్‌మెన్‌ బాలేశం, నర్సింలు, రాఘవచారి, దేవదాస్‌, అశోక్‌ రెడ్డి, రవికుమార్‌, ప్రశాంత్‌, ప్రతాప్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement