గుంతల తవ్వకం పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గుంతల తవ్వకం పూర్తి చేయాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : వనమహోత్సవంలో భా గంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పనులను వారంరోజుల్లో పూర్తిచేయాలని అదనపు డీఆర్‌డీవో కుటుంబరావు ఉపాధిహామీ సి బ్బందిని ఆదేశించారు. నాగిరెడ్డిపేట మండలంలో ని అక్కంపల్లిలో ఉన్న నర్సరీని మంగళవారం ఆయ న పరిశీలించారు. దీంతోపాటు వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు గ్రామశివారు లో కూలీలు తవ్వుతున్న గుంతలను ఆయన పరిశీలించారు. వర్షాలు కురిసేలోగా మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి ఆయన సూచించారు. మండలానికి ముందుగా నిర్ణయించిన లక్ష్యం ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాలు కురవగానే మొక్కలను నాటించాలని ఆదేశించారు. ఆయనవెంట ఈజీఎస్‌ ఈసీ సాయిలు, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య, టీఏ సత్యప్రసాద్‌, ఏఫ్‌ఏ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement