కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

గాంధారి(ఎల్లారెడ్డి): స్థానిక రేతు వేదిక భవనంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెంది న 39 లబ్ధిదారులకు ఏఎంసీ వైస్‌ చైర్మన్‌, తహసీల్దార్‌ రేణుక చౌహాన్‌ చేతుల మీదుగా మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, డీటీ బావ న్న, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎండ్రియాల్‌లో విద్యార్థులకు బహుమతులు..

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎండ్రియాల్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెల్పింగ్‌ బ్రిడ్జ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. భవిష్యత్‌లో విద్యార్థులకు కావల్సిన కేరియర్‌ గైడెన్స్‌ హెల్ఫింగ్‌ బ్రిడ్జ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు నోట్‌బుక్‌లను అందజేశారు. సంస్థ ప్రతినిధులు సుభాష్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, మనోహర్‌, మహిపాల్‌, సృజన, రాజేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఎం సరిత పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement