గంజాయి కేసులో
ఇద్దరి రిమాండ్
కామారెడ్డి క్రైం: రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి ఎకై ్సజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా.. సంభాల్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం కామారెడ్డికి రాగానే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న బ్యాగులను తనిఖీ చేయగా ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసిన 10.9 కిలోల ఎండు గంజాయి బయటపడింది. నిందితులను ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్ మిశ్రా, మహారాష్ట్రలోని పర్బనీకి చెందిన గణేష్ పండిత్‌లుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలింది. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ సంపత్‌కృష్ణ తెలిపారు. దాడుల్లో ట్రెయినీ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.


