హిందీ ఉపాధ్యాయుల జిల్లా ఫోరం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

హిందీ ఉపాధ్యాయుల జిల్లా ఫోరం ఏర్పాటు

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

కామారెడ్డి అర్బన్‌: హిందీ భాషాభివృద్ధి, హిందీ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం హిందీ ఉపాధ్యాయుల ఫోరం ఏర్పాటైంది. ఫోరం ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా కె.ఇంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.సహీంద్రనాథ్‌, ఉపాధ్యక్షులుగా పోశెట్టి, చంద్రశేఖర్‌, జాడే నర్సింలు, కార్యదర్శులుగా రవికిరణ్‌, సుదర్శన్‌, వంశీధర్‌, శ్యాంకుమార్‌, ప్రసన్న కుమార్‌, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, పండిత పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌లు అభినందించారు. అనంతరం ఫోరం ఆధ్వర్యంలో డీఈవో మల్లికార్జున్‌ను కలిసి మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement