పోలీసు అధికారులకు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారులకు వీడ్కోలు

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

పోలీసు అధికారులకు వీడ్కోలు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల బంద్‌ విజయవంతం చేయాలి ఉద్యోగ ఆరోగ్యబీమాలో ఆధునిక చికిత్సలకు అవకాశం కల్పించాలి క్రీడా మైదానం పరిశీలన కరపత్రాల ఆవిష్కరణ

కామారెడ్డి అర్బన్‌: మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో సేవలు అందించిన నలుగురు అధికారులు ఎండీ ఉస్మాన్‌, దత్తాత్రిగౌడ్‌, కె.శంకర్‌, ఎస్‌కే అహ్మద్‌, వారి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర మంగవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఉద్యోగ నిర్వహణలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటేనే పోలీసు సరిగ్గా పనిచేయగలరన్నారు. వి శ్రాంత జీవితం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

బాన్సువాడ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు అన్నారు. తాడ్కోల్‌ రైతువేదికలో జరిగిన రైతుబంధు విడుదల కార్యక్రమాన్ని ఆయన వీక్షించి మాట్లాడారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాఽభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏవో ఫయాజుల్లా, ఏఈవోలు రాణి, కావ్యశ్రీ, సర్పంచ్‌లు అందె రమేష్‌, పూజారి, మన్నె రమేష్‌, సొసైటీ చైర్మన్లు గంగుల గంగారాం, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: ఈ నెల 2న తలపెట్టిన కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు మంగళవారం కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేయాలని చూస్తోందని, దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 15న హైదరాబాద్‌లో వేలాది మందితో ‘విద్యార్థి మార్చ్‌’ చేపడతామని హెచ్చరించారు.

కామారెడ్డి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయడంతో పాటు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పథకాలను అమలు చేయడం హర్షణీయమని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో) జిల్లా అధ్యక్షుడు ఆర్‌.దేవేందర్‌ అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్‌సీ అమలు చేయాలని, బీమా పథకంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆధునిక చికిత్సలకు అవకాశం కల్పించాలని కోరారు.

గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలో మొఖరంపేట్‌ హనుమాన్‌ మందిరం వద్ద గ్రామస్తుల సహకారంతో యువకులు క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని కామారెడ్డి జిల్లా డీఆర్‌డీవో దామోదర్‌ రెడ్డి అన్నారు. డీఎల్పీవో సురేందర్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌తో కలిసి మంగళవారం క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానం చుట్టూ మొక్కలు నాటేందుకు తీస్తున్న గుంతలను పరిశీలించారు. క్రీడా మైదానం అభివృద్దికి ప్రభుత్వం తరపున తగిన సహాకారం అందిస్తామన్నారు. జీపీ కార్యదర్శి నాగరాజు, మాజీ సర్పంచ్‌ సంజీవులున్నారు.

భిక్కనూరు: హైదరాబాద్‌లోని బైరమల్‌గూడలో గల కేకే గార్డెన్స్‌లో జూలై 6న నిర్వహిస్తున్న చాకలి ఎస్సీ సాధన సమితి తొమ్మిదవ మహాసభలకు సంబంధించిన కరప్రతాలు, వాల్‌పోస్టర్లను జంగంపల్లి గ్రామంలో మంగళవారం ఆవిష్కరించారు. అన్ని గ్రామాల్లోని రజకులు అందరూ ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమితి జిల్లా అధ్యక్షుడు రాజయ్య, గౌరవ అధ్యక్షులు ఉగ్రవాయ భూమయ్య, జంగంపల్లి రజక సంఘం అధ్యక్షుడు చెన్ని రామయ్య, కార్యదర్శి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement