ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

ఎల్లారెడ్డిలో మాట్లాడుతున్న మదన్‌మోహన్‌రావు

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ఉపసర్పంచులు

– ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు

ఎల్లారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలను ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి నందిమల్ల యాదయ్య, మాస్టర్‌ ట్రైనర్‌ నరేష్‌ రాథోడ్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా, ఏఎంసీ చైర్‌పర్సన్‌ రజిత, తదితరులు పాల్గొన్నారు.

ట్యాంక్‌ బండ్‌ పనులు వేగవంతం చేయాలి

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డిలో జరుగుతున్న ట్యాంక్‌ బండ్‌ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడి పెద్ద చెరువు కట్టపై జరుగుతున్న ట్యాంక్‌ బండ్‌ పనులను ఆయన పరిశీలించారు. పనులను నాణ్యతగా చేయాలని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పద్మ శ్రీకాంత్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌, కౌన్సిలర్లు తిరుపతి, గఫార్‌, మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబా, కాంగ్రెస్‌ నాయకులు వెంకట్రాంరెడ్డి, తమ్మల శ్యాం తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

లింగంపేట(ఎల్లారెడ్డి): ఉపసర్పంచుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును మంగళవారం ఉప సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రసాద్‌గౌడ్‌ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని, తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపులో సర్పంచ్‌తో సమానంగా చెక్‌ పవర్‌ ఉండాలన్నారు. గౌరవ వేతనం రూ.5 వేలు ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. జిల్లా ఉపసర్పంచుల ఫోరం ఇన్‌చార్జి శ్రవణ్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement