సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పీర్ల మసీదుకు మరమ్మతులు

బాన్సువాడ రూరల్‌: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధు లు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. బాన్సువాడ మండల కార్యాలయంలో గ్రామాల పంచాయతీల కార్యదర్శులతో మంగళవారం ఆయన సమీక్షా స మావేశం నిర్వహించారు. గ్రామాల్లో డ్రైనేజీలు శు భ్రం చేయించాలన్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులను క్లీన్‌ చేయించడంతోపాటు బ్లీచింగ్‌ చేయించాలన్నా రు. గుంతల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చే సుకుని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా పైప్‌లైన్‌ లీకేజీలకు మరమ్మతులు చేయించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు.

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని పీర్ల మసీదు(పీర్లను ఉంచే స్థలం) శిథిలావస్థకు చేరడంతో, పీర్లను ఉంచడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వర్షాకాలంలో వర్షం నీరు పడి పీర్లు తడిసిపోతుండటంతో గ్రామంలోని వారు ముందుకు వచ్చి మసీదుకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మసీదు పైభాగంలో రేకులను అమర్చి చుట్టుపక్కల గోడలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయని, ఇంకొక రూ.లక్ష అవసరమని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే మసీదు మరమ్మతులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గాజుల వంశస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement